Janasena: గ్లాసు గుర్తు మళ్లీ జనసేనకే..!

  • పార్టీ గుర్తు విషయంలో ఈసీ తాజా నిర్ణయం
  • ఎన్నికల సంఘానికి జనసేన కృతజ్ఞతలు
  • కొంతకాలం కిందట పార్టీ సింబల్ ను రద్దు చేసిన ఈసీ
Election commission allots glass symbot to janasena

జనసేన పార్టీ గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేనకే కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది. దీంతో పార్టీ సింబల్ విషయంలో జనసేన నేతల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు కృతజ్ఞతలు చెబుతూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. అయితే, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీనిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీ గుర్తు విషయంలో జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. తాజాగా పార్టీకి మళ్లీ అదే గుర్తును కేటాయించింది.

More Telugu News