liver: ఈ సంకేతాలు కనిపిస్తే కాలేయం విషతుల్యాలతో నిండిందని అర్థం..

  • చర్మంపై దురదలు కనిపిస్తే అది సమస్యకు సంకేతమే
  • కాలేయంలో బైల్ ఉత్పత్తి తగినంత లేకపోతే మలం రంగులో మార్పు
  • కళ్లు పసుపు రంగులో కనిపించినా కాలేయంలో సమస్య ఉన్నట్టే
signs to suspect your liver is full of toxins

మన శరీరంలో కాలేయం అన్నది అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర అద్భుతమైనది. అలాంటి కాలేయం పనితీరు గాడి తప్పుతుందని తెలియజేస్తూ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.


  • కాలేయం పనితీరు సరిగా లేదనడానికి ప్రాథమిక నిదర్శనం చర్మంపై దురదలు రావడం. రక్తం నుంచి విషతుల్యాలను (టాక్సిన్లు) కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. కాలేయం ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించనప్పుడు దీనికి సంకేతంగా చర్మంపై దురదలు కనిపిస్తుంటాయి.
  • కళ్లు, చర్మం పుసుపు రంగులోకి మారినట్టు కనిపిస్తే లివర్ సమస్య బారిన పడినట్టు అర్థం చేసుకోవచ్చు. కాలేయం ఉత్పత్తి చేసిన బైల్ రూబిన్(వ్యర్థ పదార్థం) పెరిగిపోయినప్పుడు దీనికి సంకేతంగా కళ్లు పచ్చగా మారతాయి.
  • మలం రంగు పాలిపోయినట్టుగా ఉందంటే అది కాలేయం సమస్యలకు నిదర్శనమేనని భావించొచ్చు. బైల్ ఉత్పత్తి చేయడంలో కాలేయం సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఇలా జరగొచ్చు. లిపిడ్స్ ను జీర్ణం చేయడానికి బైల్ సాయపడుతుంది.
  • కాలేయం సరిగ్గా పనిచేయడం లేదనడానికి నిదర్శనం మూత్రం రంగు చిక్కగా మారిపోవడం. కాలేయం రక్తంలోని వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించలేనప్పుడు, చర్మంపై దురదలతోపాటు మూత్రం రంగు చిక్కగా మారిపోతుంది.
  • తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి, అందులోని పోషకాలను కాలేయం గ్రహిస్తుంది. ఈ పనిని కాలేయం సరిగ్గా నిర్వహించలేనప్పుడు వాంతులు కావడం, తలతిగడం కనిపిస్తుంటుంది.
  • సాలెగూడుమ మాదిరి చర్మంపై మచ్చలు కనిపించినా సరే అది కాలేయం సమస్యలకు నిదర్శనంగా భావించొచ్చు. ఈస్ట్రోజన్ అధికంగా పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. హార్మోన్ల క్రమబద్ధీకరణను కాలేయం సరిగ్గా చేయడం లేదనడానికి ఇది నిదర్శనం.
  • దెబ్బలు తగిలినప్పుడు చర్మం కింద రక్తస్రావం అయినట్టు మచ్చలు కనిపిస్తే కాలేయం ఆరోగ్యంగా లేదని భావించొచ్చు. రక్తం గడ్డ కట్టడానికి కావాల్సిన ప్రొటీన్లు లోపించినప్పుడు ఇలా జరుగుతుంది. 

More Telugu News