Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు

  • మహిళా రిజర్వేషన్ బిల్లు తమదే అన్న సోనియా
  • ఈ బిల్లు తమ కల అని వ్యాఖ్య
  • బిల్లు కోసం కాంగ్రెస్ ఎప్పటి నుంచో పట్టుబడుతోందన్న సోనియా
Women reservation bill is ours says Sonia Gandhi

ఎన్నో ఏళ్లుగా యావత్ దేశం ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంతవరకు పార్లమెంటులో ఆమోదానికి నోచుకోలేదు. ఇప్పటి వరకు పలుమార్లు పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ... పూర్తి స్థాయి మెజార్టీ లభించక అన్నిసార్లు బిల్లు వీగిపోయింది. ఈసారి అ బిల్లు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. నిన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపారు. విపక్షాలు కూడా ఈ బిల్లును స్వాగతిస్తుండటంతో... ఈసారి ఈ బిల్లు ఉభయసభల ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


మరోవైపు ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమదేనని ఆమె అన్నారు. మహిళల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఎప్పటి నుంచో పట్టుబడుతోందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు తమ కల అని అన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ స్పందిస్తూ... ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఉన్న వివరాల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. బిల్లును సీక్రెట్ గా రూపొందించకుండా... ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరితో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు.

More Telugu News