Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల.. మెగాస్టార్ సరసన ఛాన్స్

  • చిరంజీవితో నటించాలనేది అనుష్క చిరకాల స్వప్నం
  • చిరు, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్లో తాజా చిత్రం
  • ఈ సినిమా కోసం అనుష్కను సంప్రదించిన చిత్ర యూనిట్
Anushka to pair with Chiranjeevi

అందాల భామ అనుష్క సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు (17 ఏళ్లు) అవుతోంది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది హీరోల సరసన ఆమె నటించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన మాత్రం ఆమె జతకట్టలేదు. ఈ విషయంలో సినీ అభిమానులకు కూడా ఒక అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ క్రేజీ కాంబినేషన్ కు సమయం ఆసన్నమయింది. 

చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అనుష్కను సంప్రదించారని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో అనుష్క దాదాపు కన్ఫామ్ అయిందని చెపుతున్నారు. మరోవైపు, తనకు చిరంజీవితో నటించాలనేది ఒక కల అని పలు సందర్భాల్లో అనుష్క తెలిపింది. ఇన్నేళ్లకు ఆమె కల సాకారం కాబోతోంది. 

More Telugu News