Maheeesh Teekshana: ఆసియా కప్.. భారత్ తో ఫైనల్స్ కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ

Maheesh Teekshana ourt of finals
  • తొడ కండరాల నొప్పితో జట్టుకు దూరమైన తీక్షణ
  • ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ తీక్షణ
  • రేపు ఇండియా, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్స్
ఆసియా కప్ ఫైనల్స్ లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రేపు జరగనున్న ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. మొన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి తొడ కండరం పట్టేసింది. తొడ నొప్పి కారణంగా ఆయన రేపటి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ ఏడాది శ్రీలంక తరపున వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా తీక్షణ కొనసాగుతున్నాడు. స్టార్ స్పిన్నర్ జట్టుకు దూరం కావడంతో బలమైన టీమిండియాను రేపు శ్రీలంక ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
Maheeesh Teekshana
Sri Lanka
Team India

More Telugu News