Siima Awards 2023: సైమా అవార్డ్స్-2023.. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్

  • దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా అవార్డ్స్-2023 వేడుక
  • తొలి రోజున తెలుగు, కన్నడ నటులకు అవార్డుల ప్రదానం
  • ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల, ఉతమ దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళికి అవార్డులు
Siima awards 2023 NTR bestowed best actor award

దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2023 (సైమా అవార్డ్స్) వేడుక కన్నుల పండువగా సాగుతోంది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలి రోజున తెలుగు, కన్నడ నటీనటులు హాజరయ్యారు. ట్రెండీ దుస్తుల్లో తారలు తళుక్కుమన్నారు. తమ ప్రదర్శనలతో కార్యక్రమానికి వచ్చిన సినీ అభిమానులను ఉర్రూతలూగించారు.

ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఈ ఏడాది ఉత్తమనటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు. ధమాకా మూవీలో మెరిసిన శ్రీలీల ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కగా సీతారామం మూవీ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. 
 
ఈ ఏడు సైమా విజేతలు..  

  • ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
  • ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి  (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతీ మూవీస్)
  • ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
  • ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
  • ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
  • ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2)
  • ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్)
  • ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం. కీరవాణి (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ఠ (బింబిసార)
  • సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ (కార్తికేయ2)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) : మృణాల్ ఠాకూర్ (సీతారామం)
  • ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
  • ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు) : బెల్లంకొండ గణేశ్

More Telugu News