ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ
- ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖ
- 2014లోనే బీసీ రిజర్వేషన్‌కు తెలంగాణ తీర్మానం చేసిందని వెల్లడి
- ఈ రెండు బిల్లులు తీసుకువచ్చేలా పార్లమెంట్‌లో ఒత్తిడి చేయాలని ఎంపీలకు సూచన
దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాజకీయ అధికారంలో బీసీలను మరింత భాగస్వామ్యం చేయాల్సి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచన చేశారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం పాస్ చేసి, ఇందుకు సంబంధించిన ప్రతిని కూడా ప్రధాని మోదీకి లేఖతో పాటు పంపించారు.