Varla Ramaiah: తప్పు చేయడం చంద్రబాబు డీఎన్ఏలోనే లేదు: వర్ల రామయ్య

  • స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై వెబ్ సైట్ తీసుకువచ్చిన టీడీపీ
  • ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వర్ల రామయ్య
  • చంద్రబాబును చేయని తప్పుకు జైలుకు పంపారని ఆవేదన
  • వెబ్ సైట్ లో వాస్తవాలు ప్రజలంతా తెలుసుకోవాలని విజ్ఞప్తి
Varla Ramaiah came into support for Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పుడు చేయడం అనేది చంద్రబాబు డీఎన్ఏలోనే లేదని స్పష్టం చేశారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా, కక్షసాధింపులో భాగంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. 

టీడీపీ ఆవిష్కరించిన వెబ్ సైట్ లోని వివరాలు  పరిశీలిస్తే ఆయన ఏ తప్పు చేయలేదని, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే కావాలని కుట్రతో ఆయనపై అభియోగాలు మోపి జైలుకు పంపారని అర్థమవుతుందని అన్నారు.  

వెబ్ సైట్ లోని సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకొని, తెలియనివారికి కూడా తెలియజేయాలని కోరుతున్నామని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. తప్పులు, నేరాలు అన్నీ ఈ ముఖ్యమంత్రి చేసి, ప్రజలకోసం పోరాడేవారిని వేధిస్తూ ఆనందిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News