TDP: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలతో వెబ్ సైట్ తీసుకువచ్చిన టీడీపీ

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • స్కిల్ డెవలప్ మెంటు ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తున్న టీడీపీ నేతలు
  • తాజాగా మరిన్ని వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచిన వైనం
  • మొదటి నుంచీ ఏం జరిగిందో అన్ని వివరాలు వెబ్ సైట్ లో ఉన్నాయన్న అచ్చెన్న 
TDP launches website on Skill Development Project

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును తప్పుడు ఆరోపణలతోనే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అసలేం జరిగిందన్నది పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు మీడియా సమావేశాల ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై గణాంకాలతో సహా వివరణ ఇస్తున్నారు. 

తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన apskilldevelopmenttruth.com  వెబ్ సైట్ ను టీడీపీ ప్రజల ముందుకు తీసుకువచ్చింది. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. 

ఈ వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే, చంద్రబాబు ఏంచేశారో, యువత భవితకోసం ఎంతగా తపనపడి, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేశారో, ఈ ప్రభుత్వం ఏవిధంగా దుష్ప్రచారం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. 

వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు, నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బీద రవిచంద్ర యాదవ్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, పరుచూరి అశోక్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే ఈ వెబ్ సైట్: అచ్చెన్న      

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. చంద్రబాబునాయుడి లాంటి జాతీయ నాయకుడు తప్పుచేయలేదనే వాస్తవం ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే అన్ని ఆధారాలతో కూడిన వాస్తవాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాం. 

apskilldevelopmenttruth.com  (ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రూత్ డాట్ కామ్) అనే వెబ్ సైట్ లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వెనకున్న ఆవశ్యకత మొదలు మొత్తం ప్రాజెక్ట్ అమలైన తీరు...దానివల్ల లబ్ధిపొందిన వారి వివరాలన్నీ పొందుపరిచాం. 

2014 నవంబర్లో సీమెన్స్ సంస్థ నుంచి అప్పటి ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదన మొదలు, తదనంతరం జరిగిన అన్ని పరిణామాలను వరుసక్రమంలో పూసగుచ్చినట్టు గా వెబ్ సైట్లో వివరించాం.

More Telugu News