Jail: వీఐపీలకు జైలులో అందే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

  • కోర్టు ఆదేశాలతోనే సౌకర్యాలు కల్పిస్తామంటున్న అధికారులు
  • వీఐపీల కోసం జైలులో స్పెషల్ బ్యారక్ లు
  • ప్రత్యేకంగా గది, అటాచ్డ్ బాత్ రూం సహా పలు సదుపాయాలు
VIP Special Category Cell In Jail And What Facilities It Provides

టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ కు విధిస్తూ జైలులో ఆయనకు స్పెషల్ క్లాస్ సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే, వీఐపీలకు జైలులో ఎలాంటి సదుపాయాలు అందుతాయి..? అసలు వీఐపీ అని నిర్ధారించేది ఎవరు.. జైలు మాన్యువల్ లో దీనికి సంబంధించిన నిబంధనలు ఏం చెబుతున్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

జైళ్ల శాఖ మాన్యువల్ లో వీఐపీ అనే పదమే ఉండదని అధికారులు చెబుతున్నారు. జైలుకు చేరుకున్న వ్యక్తి ఆర్థిక స్థాయి, హోదా, జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ క్లాస్ ఖైదీగా పరిగణిస్తారని చెప్పారు. అయితే, ఇది కోర్టు అనుమతించినపుడే సాధ్యమని, దీనికోసం కోర్టు నుంచి ఆ వ్యక్తి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. న్యాయస్థానం అనుమతిస్తే వీఐపీ ఖైదీకి పలు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

అవేంటంటే..

  • స్పెషల్ బ్యారక్ లో అటాచ్డ్ బాత్ రూం ఉన్న ప్రత్యేక గది
  • బెడ్, రీడింగ్ టేబుల్
  • అల్మారా
  • ఎయిర్ కండీషనర్ (ఏసీ), ఫ్రిజ్, టీవీ 
  • ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే సదుపాయం
  • సరుకులు తెప్పించుకుని జైలులో వండించుకుని తినే అవకాశం
  • వంట చేయడానికి, దుస్తులు ఉతికేందుకు మనుషులు
  • జైలులో వారికి భద్రత కోసం పలు ఏర్పాట్లు

More Telugu News