Asia Cup: ఆసియా కప్: కొలంబోలో వర్షం... పాకిస్థాన్ శిబిరంలో ఆందోళన

  • ఆసియా కప్ లో నేడు పాకిస్థాన్, శ్రీలంక ఢీ
  • గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్తు ఖరారు
  • ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఫైనల్ కు శ్రీలంక
  • వర్షంతో మ్యాచ్ రద్దు కాకూడదని కోరుకుంటున్న పాక్
Its raining in Colombo as Pakistan team sniffs exit from Asia Cup

ఆసియా కప్ సూపర్-4 దశలో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఫైనల్ బెర్తు కోసం పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్ ను ఢీకొంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మెరుగైన రన్ రేట్ ఉన్న శ్రీలంక జట్టు ఫైనల్ కు వెళుతుంది. అయితే, పాక్-శ్రీలంక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న కొలంబోలో వర్షం పడుతోంది. దాంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. ఈ పరిణామంతో పాకిస్థాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ పోరులో గెలిచి ఫైనల్లో భారత్ ను సవాల్ చేయాలని భావించిన పాక్ జట్టుకు వర్షం విలన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News