Pawan Kalyan: ములాఖత్ లో చంద్రబాబుతో ఏం మాట్లాడానంటే..!: పవన్ కల్యాణ్

What Pawan Kalyan spoke with Chandrababu in jail
  • చంద్రబాబును కలిసిన పవన్, బాలయ్య, లోకేశ్
  • ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును అడిగానన్న పవన్
  • మీకు ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉందని చెప్పానన్న జనసేనాని
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేశ్ సమావేశమయ్యారు. ములాఖత్ ముగిసిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మీరు ఏం మాట్లాడారంటూ ఒక మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా.. మీ ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును అడిగానని చెప్పారు. మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉందని చెప్పానని అన్నారు. పాలసీల పరంగా గతంలో మీతో విభేదించానని, కానీ వ్యక్తిగతంగా మీమీద తనకు ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవని స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని అక్కడున్న అధికారులను అడిగానని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News