Allu Arjun: ‘జవాన్’పై అల్లు అర్జున్ ప్రత్యేక ట్వీట్

 Allu Arjun Biggg Congratulations to the whole team of  JAWAN
  • షారూక్ ఖాన్ ఎన్నడూలేని అవతారం ఎత్తారంటూ ప్రశంస 
  • దీపికను ప్రభావవంతమైన స్టార్ గా పేర్కొన్న అల్లు అర్జున్
  • నయనతార జాతీయ స్థాయిలో మెరిశారంటూ ట్వీట్
షారూక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు దీనిపై స్పందించగా.. తాజాగా అల్లు అర్జున్ సైతం ప్రత్యేక అభినందనలతో ముందుకు వచ్చారు. ట్విట్టర్ లో ఓ పెద్ద పోస్ట్ నే పెట్టారు.

‘‘ఇంత భారీ విజయాన్ని అందుకున్న జవాన్ టీమ్ మొత్తానికి పెద్ద అభినందనలు. మొత్తం నటీనటులు.. టెక్నీషియన్లు, క్రూ, నిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ అల్లు అర్జున్ తన స్పందన వ్యక్తం చేశారు. ‘‘షారూక్ ఖాన్ గారు.. ఎప్పుడూ లేని అవతారం ఎత్తారు. మొత్తం భారత్ ను వినోదంలో ముంచేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది. ఎప్పటి మాదిరే విజయ్ సేతు గారు తన పాత్రలో గొప్పగా నటించారు. దీపికా పదుకొణె సొగసైన ప్రభావవంతమైన స్టార్. నయనతార జాతీయ స్థాయిలో వెలిగిపోయారు’’ అంటూ ఇలా ఒక్కొక్కరిని పేరుపేరునా అల్లు అర్జున్ అభినందించారు.
Allu Arjun
Congratulations
JAWAN team

More Telugu News