Sudhir Chaudhary: మతాల మధ్య చిచ్చుపెట్టేలా సబ్సిడీ పథకంపై అవాస్తవ కథనాలు.. ఆజ్‌తక్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై కర్ణాటక కాంగ్రెస్ కేసు

Karntaka Congress Files Police Case Against Aaj Tak Editor Sudhir Chaudhary
  • మైనార్టీల కోసం సారథి పథకం తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం
  • హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేలా సుధీప్ చౌదరి కథనం ఉందంటూ ఫిర్యాదు
  • కోర్టులో తేల్చుకుందామన్న సుధీర్ చౌదరి

మైనారిటీల కోసం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ పథకంపై దుష్ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో ‘ఆజ్‌తక్’ న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ సుధీర్ చౌదరితోపాటు ఆ సంస్థపై కేసు నమోదైంది. కర్ణాటక మైనారిటీల అభివృద్ధి కార్పొరేషన్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ నెల 11న ఆజ్‌తక్ చానల్‌లో సబ్సిడీ పథకంపై ప్రసారమైన కథనం మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. హిందూ, ఇతర మతాల మధ్య చిచ్చుపెట్టి మత కలహాలను రెచ్చగొట్టేలా వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. ఈ కథనం గురించి సుధీర్ చౌదరికి పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. 

ఈ కేసుపై సుధీర్ చౌదరి ఎక్స్ ద్వారా స్పందించారు. పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టడం చూస్తుంటే తన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టుగా ఉందన్నారు. సారథి పథకంలో హిందువులను ఎందుకు చేర్చలేదన్నదే తన ప్రశ్న అన్న ఆయన కోర్టులో కలుసుకుందామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News