atlee: ‘జవాన్’ పాటకు కీర్తి సురేశ్‌తో అట్లీ భార్య స్టెప్పులు.. వీడియో ఇదిగో!

Atlee wife praya and keerti suresh shakes legs for Jawan movie song
  • షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్
  • అట్లీ దర్శకత్వంలో ఈ నెల 7న విడుదలైన చిత్రం
  • నాలుగు రోజుల్లోనే రూ. 500 కలెక్షన్లు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'జవాన్' సక్సెస్‌ ఫుల్ టాక్, రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.   షారుక్ సొంత బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. షారుక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించారు. దీపికా పదుకొణే, సంజయ్‌ దత్ కీలక పాత్రాలు పోషించారు. ఈ నెల 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమా విజయంతో అట్లీ ఆయన కుటుంబ సభ్యులు తెగ సంతోషంగా ఉన్నారు. అట్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 ఈ క్రమంలో అభినందలు తెలిపేందుకు అట్లీ ఇంటికి వచ్చిన దక్షిణాది నటి కీర్తి సురేశ్ ఆయన భార్య ప్రియా మోహన్‌తో కలిసి ‘జవాన్‌’ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ ఇద్దరూ ‘చెలెయా’ పాటకు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. తమ పెంపుడు కుక్కపిల్లను పట్టుకొని అట్లీ నవ్వుతూ వీళ్ల ముందుకు వచ్చారు. కుక్కను కీర్తి సురేశ్ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా..అది అరవడంతో భయపడింది. దాంతో ముగ్గురూ ఒక్కసారిగా నవ్వారు. అట్లీ భార్య ప్రియా మోహన్ ఈ వీడియోను ట్విట్టర్‌‌ (ఎక్స్)లో షేర్ చేసింది.
atlee
jawan
Shahrukh Khan
keerti suresh

More Telugu News