సోము వీర్రాజు ఉంటే... 'బావ'సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదు: విజయసాయిరెడ్డి
- సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉండి ఉంటే పురందేశ్వరిలా అవినీతిపరులకు మద్దతు పలికేవారు కాదన్న విజయసాయి
- టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారని వెల్లడి
- ఇండియా కూటమికి చంద్రబాబు దగ్గరవుతోన్న విషయం బీజేపీకి తెలుసన్న విజయసాయి
సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే పురందేశ్వరిలా అవినీతిపరులకు మద్ధతు పలికేవారు కాదని, టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే 'బావ'సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదని చురక అంటించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా చంద్రబాబు 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి దగ్గరవుతున్న విషయం బీజేపీ అధిష్ఠానానికి తెలుసునని వ్యాఖ్యానించారు.