Abhishek Bachchan: అంతా ఐశ్వర్యే చూసుకుంటుంది..: అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan shares parenting tips I do not do the heavy lifting at home wife allows me to go and work
షార్ట్స్‌లో చూడండి
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య 13వ ఏటలోకి అడుగు పెట్టింది. టీనేజీలోకి అడుగు పెట్టడంతో పేరెంటింగ్ టిప్స్ ను పంచుకోవాలంటూ ఓ మీడియా సంస్థ అభిషేక్ బచ్చన్ ను కోరింది. ఎదురు తిరిగే స్వభావంతో ఉండే టీన్స్ ను ఎలా నియంత్రించాలంటూ ప్రశ్న ఎదుర్కొన్నారు. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. పేరెంటింగ్ విషయానికొస్తే ఇంట్లో తానేమీ పెద్ద పాత్ర పోషించనని స్పష్టం చేశారు. తన జీవిత భాగస్వామి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటుందని బదులిచ్చారు.

ఏవైనా పేరెంటింగ్ టిప్స్ ను పంచుకుంటారా? అన్న ప్రశ్నకు.. ‘‘నేటి తరం చాలా వేగంగా పరిణతి సాధిస్తోంది. మనం ఈ రోజు ఈ స్థాయికి ఎలా చేరుకున్నామనే దాని వెనుకనున్న ప్రక్రియను చూడలేని ప్రపంచంలో వారు జన్మిస్తున్నారు. నాకు మేనల్లుడు, మేనకోడలు ఉన్నారు. వారికి పదో ఏట రాగానే మొబైల్ ఫోన్ ఇచ్చేశారు. వేళ్లపై సమాచారం లభించే ప్రపంచంలోకి వారు వస్తున్నారు.  నేను మొదటిసారి తాజ్ మహల్ ను చూసినప్పుడు ఊపిరి ఆడలేదు. కానీ ప్రస్తుత తరానికి ఆ అనుభవం ఉండడం లేదు. ఎందుకంటే వారు ముందే ఇంటర్నెట్ లో చూసేస్తున్నారు’’ అని అభిషేక్ బచ్చన్ వివరించాడు. తన భార్య ఇంటి బాధ్యతలు అన్నింటినీ చూసుకుంటూ, తనను పని చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పాడు.
Go Back to Shorts
Abhishek Bachchan
parenting tips

More Telugu News