విమానం టాయిలెట్ లో ఓ జంట శృంగారం.. యూకేలో ఘటన
- ల్యాండయ్యాక వారిని పోలీసులకు అప్పగించిన సిబ్బంది
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారని వెల్లడి
లోపల శృంగారం జరుపుతున్న యువకుడు వెంటనే డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అయితే, ఇదంతా ఓ ప్రయాణికుడి సెల్ ఫోన్ లో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ నెల 8న లండన్ లోని లూటన్ సిటీ నుంచి లిబిజా ఐలాండ్ కు వెళుతున్న తమ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఈజీ జెట్ సంస్థ వెల్లడించింది. రెండున్నర గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఓ జంట అసభ్యంగా ప్రవర్తించిందని, లిబిజా ఐలాండ్ లో విమానం ల్యాండ్ అయ్యాక ఆ జంటను పోలీసులకు అప్పగించామని తెలిపింది. అయితే, ఆ జంటను పోలీసులు అరెస్టు చేశారా? లేక హెచ్చరించి వదిలేశారా? అనే వివరాలను ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించలేదు.