China Delegates: జీ20 చైనా టీమ్ సంచుల్లో ఏమున్నాయి?.. 5 స్టార్ హోటల్ లో 12 గంటల హైడ్రామా!

  • చైనీస్ డెలిగేట్స్ బస చేసి హోటల్ తాజ్ ప్యాలస్ లో హైడ్రామా
  • రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు ఉన్నాయని గుర్తించిన హోటల్ సిబ్బంది
  • స్కానర్ లో బ్యాగులు ఉంచాలని కోరిన హోటల్ మేనేజ్ మెంట్
  • బ్యాగుల స్కానింగ్ కు నిరాకరించిన చైనా అధికారులు
  • బయటకు వెళ్లకుండా ఆపిన సెక్యూరిటీ
G20 China delegates left 5 star hotel after 12 hours high drama

ఢిల్లీలో నిర్వహించిన జీ20 సమ్మిట్ విజయవంతమయింది. జీ20 దేశాధినేతలతో పాటు సమావేశాలకు వచ్చిన 40కి పైగా దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా వారి దేశాలకు వెళ్లిపోయారు. మరోవైపు, చైనా నుంచి వచ్చిన డెలిగేట్స్ బస చేసిన 5 స్టార్ హోటల్ తాజ్ ప్యాలెస్ లో హైడ్రామా నడిచింది. 

వివరాల్లోకి వెళ్తే.. చైనా డెలిగేట్స్ లోని ఓ సభ్యుడికి చెందిన రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికాలు ఉన్నాయనే విషయాన్ని హోటల్ స్టాఫ్ కు చెందిన ఒక వ్యక్తి గమనించాడు. వెంటనే సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రెండు బ్యాగులను స్కానర్ లో ఉంచాలని చైనా అధికారులను సెక్యూరిటీ కోరింది. అయితే స్కానర్ లో బ్యాగులను ఉంచేందుకు చైనా అధికారులు నిరాకరించారు. దీంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. ఈ హైడ్రామా దాదాపు 12 గంటల సేపు కొనసాగింది. 

ఈ క్రమంలో చైనీస్ డెలిగేట్స్ కు, మన అధికారులకు మధ్య సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. చివరకు వారి బ్యాగులకు చైనీస్ ఎంబసీకి తరలించేందుకు అధికారులు అనుమతించారు. దీంతో వారు హోటల్ నుంచి 12 గంటల తర్వాత బయటకు వచ్చారు. ఇంకోవైపు, జీ20 సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాని సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రధాని లి క్వియాంగ్ హాజరయ్యారు.

More Telugu News