జైల్లో యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు.. ఈరోజు కుటుంబసభ్యులతో ములాఖత్
- నిన్న రాత్రి త్వరగా నిద్రపోయిన చంద్రబాబు
- ఉదయం వార్తాపత్రికలను చదివిన టీడీపీ అధినేత
- అల్పాహారాన్ని అందించిన సహాయకుడు
ఈ రోజు తన కుటుంబసభ్యులతో చంద్రబాబు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక పత్రేక గదిని ఆయనకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.