YS Jagan: ముగిసిన లండన్ పర్యటన.. ఏపీకి చేరుకున్న సీఎం జగన్

AP CM Jagan Bharati reddy reaches ap after concluding london tour
  • నేడు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన సీఎం జగన్ దంపతులు 
  • గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు
  • అనంతరం, రోడ్డు మార్గంలో తమ నివాసానికి సీఎం దంపతుల పయనం
లండన్ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అర్ధాంగి భారతి రెడ్డి నేడు ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి స్వాగతం పలికేందుకు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జోగి రమేష్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, వల్లభనేని వంశీ, కొలుసు పార్థ సారథి, మల్లాది విష్ణు తదితర నేతలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, వారు ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో తమ నివాసానికి ప్రయాణమయ్యారు.
YS Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News