Roja: భువనేశ్వరి, బ్రాహ్మణిలు కూడా బంద్ పాటించలేదు!: రోజా చురకలు

  • చంద్రబాబు భార్య, లోకేశ్ భార్య కూడా బంద్ పాటించలేదన్న రోజా
  • బంద్ లేదు.. బొంద లేదు.. బార్లా తెరుచుకున్న హెరిటేజ్ సంస్థ అని వ్యాఖ్య
  • వారి కుటుంబ వ్యాపారం బాగుండాలి.. ఇతరులు బంద్ పాటించాలా? అని ప్రశ్న
Roja on Heritage parlour opening on AP bandh day

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఆ పార్టీ సోమవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఏపీ బంద్ ఫెయిల్ అయిందంటూ కనీసం చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా మూతబడలేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా కూడా తన సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో హెరిటేజ్ తెరిచి ఉందంటూ ఓ పోస్ట్ పెట్టారు. కనీసం నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి కూడా ఈ బంద్ పాటించలేదని ఎద్దేవా చేశారు.

'చంద్రబాబు భార్య (భువనేశ్వరి), లోకేష్ భార్య (బ్రాహ్మణి) కూడా ఆ బంద్ పాటించలేదు.. బంద్ లేదు.. బొంద లేదు.. అని బార్లా తెరుచుకున్న హెరిటేజ్ సంస్థలు. చంద్రబాబు కుటుంబానికి వాళ్ళ వ్యాపారం బాగుండాలి.. ఆయన కోసం ఇతరులు మాత్రం బంద్ పాటించాలా..? వీరి నైజం తెలుసు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు  బంద్‌ని విఫలం చేశారు.' అని ట్వీట్ చేశారు.

More Telugu News