Vijayasai Reddy: చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy response on Chandrababu jail life
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు 7691 నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వియసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691.
7 6 9 1 = 23. చంద్రబాబు గారూ... మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు' అని ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రబాబు జైలుకు వెళ్లడంపై వైసీపీ మంత్రులు, నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి రోజా టపాసులు కాల్చి, కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళి అర్పించారు.

Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News