తండ్రయిన బుమ్రాకు అనుకోని కానుక
- ఇటీవల తండ్రయిన బుమ్రా
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా భార్య సంజన
- ఆసియా కప్ మధ్యలో భారత్ వెళ్లొచ్చిన బుమ్రా
- ఇవాళ మ్యాచ్ కు ముందు బుమ్రాకు గిఫ్ట్ ఇచ్చిన పాక్ బౌలర్ అఫ్రిది
ఈ సందర్భంగా బుమ్రాకు అనుకోని కానుక లభించింది. మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిది... తండ్రయిన బుమ్రాకు ఓ గిఫ్టును బహూకరించాడు. బుమ్రాకు తన తరఫున, పాకిస్థాన్ జట్టు తరఫున శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.