నేనున్నానంటూ వచ్చేసిన వరుణుడు... నిలిచిపోయిన భారత్-పాక్ మ్యాచ్
- ఆసియా కప్ లో నేడు భారత్ తో పాకిస్థాన్ అమీతుమీ
- 25వ ఓవర్లో వరుణుడు ప్రత్యక్షం
- అప్పటికి భారత్ స్కోరు 2 వికెట్లకు 147 పరుగులు
- ఓ మోస్తరు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది
వర్షంతో అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభ్ మాన్ గిల్ 58 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 1, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.