చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది: 'జోహో' సీఈవో శ్రీధర్ వెంబు

Zoho CEO Sridhar Vembu responds on Chandrababu arrest
  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు ఎలాంటి వారో తనకు తెలుసన్న శ్రీధర్ వెంబు
  • జోహో సహా అనేక కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు కృషి చేశారని వెల్లడి
  • అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని ఓ అవినీతి కేసులో అరెస్ట్ చేశారన్న వార్త చాలామందికి విస్మయం కలిగించింది. దీనిపై భారత బహుళ జాతీయ టెక్నాలజీ కంపెనీ జోహో సీఈవో శ్రీధర్ వెంబు స్పందించారు. నిన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్న వార్త చదివి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 

ఆయన గురించి తనకు తెలుసని, ఆంధ్రప్రదేశ్ కు జోహో సహా అనేక కంపెనీలను తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారని శ్రీధర్ వెంబు వెల్లడించారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్త పత్రికా క్లిప్పింగ్ ను కూడా ఆయన పంచుకున్నారు.
Go Back to Shorts
Sridhar Vembu
Chandrababu
Arrest
Zoho
Andhra Pradesh
TDP

More Telugu News