ఆసియా కప్ లో దాయాదుల సమరం-2... టాస్ ఓడిన టీమిండియా

Team India lost toss against Pakistan in Asia Cup
  • ఆసియా కప్ లో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • సూపర్-4 దశలో తలపడుతున్న ఇరు జట్లు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • జట్టులో చేరిన బుమ్రా... శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్
ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడుతున్నాయి. గ్రూప్ దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణం కాగా, నేడు సూపర్-4 దశలో రెండు జట్లు మరోసారి ఢీకొంటున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది. 

ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్... భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో రెండు మార్పులు జరిగాయి. వీపు నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. ఇటీవల తండ్రి కావడంతో స్వదేశం వెళ్లిన బుమ్రా తిరిగి జట్టులో చేరాడు.
Go Back to Shorts
Team India
Toss
Pakistan
Super-4
Asia Cup

More Telugu News