చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లు చేర్చిన సీఐడీ
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత
- విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబు హాజరు
- 15 రోజుల కస్టడీ కోరిన సీఐడీ
ఈ కేసులో సీఐడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు పేర్లను కూడా చేర్చింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపించారు. దాంతో, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.