Coco Gauff: యూఎస్ ఓపెన్ లో కొత్త చాంప్... కోకో గాఫ్

  • మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన కోకో గాఫ్
  • కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించిన 19 ఏళ్ల కోకో గాఫ్
  • యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపై ఘనవిజయం
Coco Gauff wins US Open Womens Singles title

అమెరికా టీనేజి అమ్మాయి కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ 2-6, 6-3, 6-2తో తన కంటే మెరుగైన సీడెడ్ ప్లేయర్ అరియానా సబలెంకాను ఓడించింది. 

న్యూయార్క్ లోని ఆర్ధర్ ఆష్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన ఈ టైటిల్ సమరంలో కోకో గాఫ్ తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ... అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకుని విజేతగా నిలిచింది. 

ఫ్లోరిడాకు చెందిన 19 ఏళ్ల కోకో గాఫ్ కు కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. మొదటి గ్రాండ్ స్లామ్ ను సొంతగడ్డపై గెలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో కోకో గాఫ్, సబలెంకా అనేక అనవసర తప్పిదాలకు పాల్పడిప్పటికీ, చివరికి అమెరికా అమ్మాయిదే పైచేయి అయింది.

More Telugu News