Raveena Tandon: ఆ పాట చిత్రీకరణ తరువాత టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నా: రవీనా టాండన్

Raveena tandon talks about how she had suffered injuries during tip tip barsa pani shoot
షార్ట్స్‌లో చూడండి
భారతీయ సినిమాల్లో వాన పాటలకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆ పాటల చిత్రీకరణ కోసం నటీనటులు పడే కష్టం మాత్రం అపారం. ఇక బాలీవుడ్ సినిమా ‘మోహ్రా’లో ‘టిప్ టిప్ బరసా పానీ వానపాటల్లోకెల్లా ఓ సంచలనం అంటే అతిశయోక్తి కాదేమో. ఈ మూవీలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ జంటగా నటించారు. అప్పట్లో ఈ పాట యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. అయితే పాట చిత్రీకరణలో తాను పడ్డ ఇబ్బందుల్ని రవీనా టాండన్ తాజాగా వివరించారు. 

‘‘నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేశారు. చుట్టూ ఇనుప చువ్వలు, అపరిశుభ్ర పరిసరాలు! దీంతో, కాళ్లకు చెప్పుల్లేకుండా పాట షూట్‌లో పాల్గొన్న నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వర్షంలో చీర ధరించి అలాంటి మూమెంట్స్ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చింది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు నీ ప్యాడ్స్ వేసుకున్నా. ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు గాయాలయ్యాయి. టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత రెండు రోజుల పాటు అనారోగ్యానికి గురయ్యా. మీకు తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు పడ్డా పాటకు వచ్చిన రెస్పాన్స్‌కు మేము ఎంతో ఆనంద పడ్డాం’’ అని నాటి జ్ఞాపకాల్ని తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది రవీనా.
Go Back to Shorts
Raveena Tandon
Akshay Kumar
Bollywood

More Telugu News