Vaishnav Tej:  'ఆదికేశవ' నుంచి 'సిత్రాల సిత్రావతి' లిరికల్ సాంగ్ రిలీజ్!

  • వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఆదికేశవ'
  • ఆయన జోడీకట్టిన శ్రీలీల
  • సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • నవంబర్ 10వ తేదీన సినిమా విడుదల
Adikeshava movie lyrical song released

వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఆదికేశవ' సినిమా నిర్మితమైంది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యం ... దేవాలయం నేపథ్యంతో ముడిపడిన కథ ఇది. వైష్ణవ్ తేజ్ కెరియర్లో ఫస్టు టైమ్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కంటెంటు ఇది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'సిత్రాల సిత్రావతి .. ఉన్నపాటున పోయేమతి, సూపులో పచ్చ జెండా ఎత్తి .. నన్ను చేసినవే ఛత్రపతి" అంటూ ఈ పాట సాగుతోంది. వైష్ణవ్ - శ్రీలీలపై ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో కలర్ఫుల్ గా చిత్రీకరించారు.

జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ బాణీకీ .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. రాహుల్ సిప్లి గంజ్ .. రమ్య బెహ్రా ఆలపించారు. జోరుగా .. హుషారుగా సాగే బీట్ తో ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంది. నవంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News