PM Modi: జీీ-20 సదస్సు అప్ డేట్స్.. అతిథులకు స్వయంగా స్వాగతం పలుకుతున్న ప్రధాని

  • ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కు చేరుకున్న ప్రధాని మోదీ
  • ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరికీ ప్రధాని ఘనస్వాగతం
  • ప్రత్యేక ఆకర్షణగా కోణార్క చక్రం
G20 Summit 2023 in Delhi Live Updates PM Modi welcomes UK PM Rishi Sunak US President Joe Biden

భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ దేశాధినేతలకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత్ మండపం వద్దకు ప్రధాని చేరుకున్నారు. అలాగే, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వేదిక వద్దకు విచ్చేశారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని టాప్20 దేశాధినేతలు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ఇందులో భాగంగా చర్చకు రానుంది.

మండపానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అలాగే, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జర్మనీ చాన్స్ లర్ ఓలఫ్ స్కాల్జ్, మారిషస్ అధ్యక్షుడిని కూడా ఆహ్వానించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన కోణార్క చక్రం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఐఎంఎఫ్ ఎండీ, చైర్మన్ క్రిస్టలీనా జార్జీవా, ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ నోజి ఒకోంజో సదస్సు కోసం విచ్చేశారు. సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ప్రధాని స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. 

భారత్-యూఎస్ సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కట్టుబడి ఉన్నందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ను ప్రధాని మోదీ అభినందించారు. బైడెన్, మోదీ నిన్న రాత్రి ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కీలకమైన 6జీ, ఏఐ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

More Telugu News