AP CID: కాసేపట్లో ఏపీ సీఐడీ డీజీ మీడియా సమావేశం

  • నంద్యాలలో ఈ ఉదయం చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలు
  • రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న అధికారులు
  • సొంత కాన్వాయ్ లోనే విజయవాడ వస్తున్న చంద్రబాబు
  • చంద్రబాబును కోర్టులో హాజరుపరిచే అవకాశం
AP CID DG will talk to media

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని ఏపీ సీఐడీ పోలీసులు ఈ ఉదయం నంద్యాల వద్ద అరెస్ట్ చేశారు. ఆయనను రోడ్డు మార్గం ద్వారా విజయవాడ తరలిస్తున్నారు. చంద్రబాబు తన సొంత కాన్వాయ్ లోనే విజయవాడకు వచ్చేందుకు సీఐడీ అధికారులు అంగీకరించారు. 

చంద్రబాబు వెంట మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఉన్నారు. చంద్రబాబును ఈ మధ్యాహ్నం మూడో అడిషనల్ జిల్లా కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, మరి కాసేపట్లో ఏపీ సీఐడీ డీజీ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై మాట్లాడతారని తెలుస్తోంది.

More Telugu News