ఐఫోన్ వాడుతున్నారా.. అయితే, వెంటనే అప్ డేట్ చేసుకోండి
- ఎమర్జెన్సీ సెక్యూరిటీ అప్ డేట్ విడుదల చేసిన యాపిల్ కంపెనీ
- పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నం జరుగుతోందని అలర్ట్
- ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో లోపాలను గుర్తించిన ఇంటర్నెట్ వాచ్ డాగ్
సాఫ్ట్ వేర్ లోపాలకు సంబంధించిన వివరాలతో యాపిల్ కంపెనీని అప్రమత్తం చేయగా.. వెంటనే స్పందించిన కంపెనీ వినియోగదారులకు సెక్యూరిటీ అప్ డేట్ ను అందించింది. ఎలాంటి లింక్ లతో సంబంధం లేకుండా.. అసలు ఫోన్ యజమాని ఏం చేయకున్నా సరే ఫోన్ లోకి ఈ మాల్ వేర్ చేరుతుందని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. ఒకసారి ఈ మాల్ వేర్ ఎంటరైతే ఫోన్ లోని కెమెరా ఆన్ కావడం, వాయిస్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయని, ఫోన్ లోని కీలక సమాచారం హ్యాకర్లకు చేరుతుందని పేర్కొంది. కాగా, ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో తాము గుర్తించిన లోపాలను ‘జీరో డే బగ్స్’ గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. అంటే ఈ లోపాలను సరిదిద్దడానికి ఒక్క రోజు కూడా సమయంలేదని ఆ కంపెనీ వెల్లడించింది.