G20: జీ20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు దూరం.. కారణం ఇదే!

Spain President Pedro Sanchez not attending G20 due to Covid
  • స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ కు కరోనా పాజిటివ్
  • జీ20 సమావేశాలకు వెళ్లలేకపోతున్నానని ట్వీట్
  • రేపు, ఎల్లుండి జరగనున్న జీ20 సమ్మిట్
ఢిల్లీలో రేపటి నుంచి రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాలు సహా 40కి పైగా దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ హాజరుకావడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్, ఇతర కారణాల వల్ల జిన్ పింగ్ రావడం లేదు. ఈ జాబితాలో మరో దేశాధినేత కూడా చేరారు. 

స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ ఈ సమావేశాలకు రావడం లేదు. పెడ్రో శాంచెజ్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్వయంగా తెలిపారు. కరోనా కారణంగా ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు వెళ్లలేకపోతున్నానని ఆయన చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.
G20
Spain President
Pedro Sanchez

More Telugu News