ఎమ్మెల్యేల వేతనాలను రూ.40 వేలు పెంచుతున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ
- తాజా పెంపుతో రూ.10వేల నుండి రూ.50వేలకు పెరగనున్న ఎమ్మెల్యేల వేతనాలు
- వివిధ రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు తక్కువ
- అలవెన్స్, ఇతర ప్రయోజనాలు కలిపి రూ.1.21 లక్షలు అందుకోనున్న ఎమ్మెల్యేలు
పెంపు నిర్ణయం ప్రకటన తర్వాత ఎమ్మెల్యేల వేతనాలు ప్రస్తుతం ఉన్న రూ.10వేల నుండి రూ.50వేలకు పెరగనున్నాయి. మంత్రుల జీతాలు రూ.10,900 నుండి రూ.50,900కు పెరగనున్నాయి. కేబినెట్ మంత్రుల వేతనాలు రూ.11వేల నుండి రూ.51వేలకు పెరగనున్నాయి. అలవెన్స్‌లు, ఇతర ప్రయోజనాలు అదనం. వాటిని కలుపుకుంటే ఎమ్మెల్యేలకు రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు అందనున్నాయి.