rachamallu shivaprasad reddy: ప్రేమించిన యువకుడితో కూతురు పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు

MLA Rachamallu daughter love marriage in Proddutur
  • ప్రేమించిన పవన్ అనే యువకుడితో పెద్ద కూతురు పల్లవి వివాహం
  • బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి
  • వారిద్దరూ ఇష్టపడటంతో డబ్బు, హోదా, కులం చూడకుండా పెళ్లి చేసినట్లు చెప్పిన రాచమల్లు
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురుకు ప్రేమ పెళ్లి... దగ్గరుండి జరిపించారు. ఎమ్మెల్యే మొదటి కూతురు పల్లవి ప్రేమించిన పవన్ అనే యువకుడితో బొల్లవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. తన కూతురుకు ఇష్టమైన యువకుడితో పెళ్లి చేశానని రాచమల్లు చెప్పారు. వారిద్దరు కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడ్డారని తెలిపారు. డబ్బు, హోదా, కులం వంటి వాటికి విలువ ఇవ్వకుండా వారిద్దరు ఇష్టపడటంతో, వారి అంగీకారం ప్రకారం పెళ్లి చేసినట్లు తెలిపారు.
rachamallu shivaprasad reddy
Kadapa District
YSRCP

More Telugu News