Rohit Sharma: ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Rohit Sharma key comments before BCCI team announcement for ODI World Cup
  • అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్
  • అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఇండియా తొలి మ్యాచ్
  • జట్టులో ఒకటి, రెండు తప్ప పెద్దగా మార్పులు ఉండవన్న రోహిత్
అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా వన్డే ప్రపంచకప్ హడావుడి మొదలయింది. ఇండియాలో జరగనున్న ఈ ఐసీసీ మెగా టోర్నీపై అన్ని జట్లు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నాయి. ఈ రోజు టీమిండియా వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. జట్టులో ఎవరెవరు ఉంటారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. బీసీసీఐ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ వెలువడనున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్ జట్టులో ఒకటి, రెండు తప్ప పెద్దగా మార్పులు ఏమీ ఉండవని అన్నారు. 

అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడబోతోంది. ఇక ఆసియా కప్ విషయానికి వస్తే నిన్న నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఇండియా సూపర్ 4లో అడుగుపెట్టింది.
Rohit Sharma
Team India
ODI World Cup

More Telugu News