Extramarital Affair: సత్యసాయి జిల్లాలో దారుణం.. వివాహేతర సంబంధం అనుమానంతో భర్త, అతని ప్రియురాలికి గుండు కొట్టించి ఊరేగించిన భార్య!

Man and woman partially tonsured and paraded over extramarital affair in Sri Sathya Sai district
  • కుటుంబ సభ్యులతో కలిసి భర్త, మహిళను పట్టుకున్న భార్య
  • ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పారిపోయిన హుస్సేన్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు
  • హుస్సేన్ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు
వివాహేతర సంబంధం అనుమానంతో ఓ జంటకు పాక్షికంగా గుండుకొట్టి ఊరేగించారు. సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో జరిగిందీ ఘటన. తన భర్త హుస్సేన్ (30) హస్నాబాద్‌కు చెందిన షబానా (32)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించిన భార్య నజియా కుటుంబ సభ్యులతో కలిసి వారిని పట్టుకుని కట్టేసింది. ఆపై పాక్షికంగా గుండుకొట్టి వీధుల్లో నడిపించారు. అనంతరం వారిని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా హుస్సేన్ తప్పించుకుని పారిపోయాడు. 

షబానా ఉండే ప్రాంతానికి వెళ్లిన నజియా అక్కడ వారిద్దరినీ పట్టుకుని గుండుకొట్టించి ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. హుస్సేన్‌, షబానాకు గుండు కొడుతున్నప్పుడు ఆ దృశ్యాలను నజియా కుటుంబ సభ్యులు వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. నజియా, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితమే నజియా భర్త నుంచి విడిపోయినట్టు పోలీసులు తెలిపారు.
Extramarital Affair
Sri Sathya Sai District
Andhra Pradesh
Tonsure
Parade

More Telugu News