Rishabh Pant: ప్రపంచకప్ టీమ్ లోకి వచ్చేందుకు పంత్ కఠోర సాధన

  • బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ
  • ఫిట్ నెస్ సాధిస్తే ప్రపంచకప్ లో అవకాశం
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన పంత్
Rishabh Pant does high intensity workout in NCA

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్ నెస్ కోసం కఠినంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం పంత్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. గాయాల నుంచి పంత్ పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఫిట్ నెస్ ఒక్కటీ సాధిస్తే తిరిగి మునుపటి ఫామ్ ను చూపించే అవకాశం లేకపోలేదు. 2022 డిసెంబర్ 30న పంత్ తన కారులో ఒంటరిగా ఉత్తరాఖండ్ లోని రూర్కీకి వెళుతుండగా డివైడర్ ను ఢీకొనడం తెలిసిందే. ఆ సమయంలో గాయాలతో పంత్ బయటపడ్డాడు. మోకాలి లిగ్ మెంట్లు దెబ్బతినడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

ఈ ప్రమాదం కారణంగా పంత్ ఐపీఎల్ 2023 సీజన్, ఆసియా కప్ టోర్నమెంట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత కోలుకున్న పంత్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరిపోయాడు. ఎన్ సీఏలో తాను శిక్షణ పొందుతున్న వీడియోని పంత్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘‘చీకటి కుహరంలో కొంత వెలుగునైనా చూడడం మొదలైనందుకు దేవుడికి ధన్యవాదాలు’’ అంటూ తన స్పందన తెలియజేశాడు. (వీడియో కోసం)

More Telugu News