JDU leader: ఎవరో ఒకరు చెప్పారని, రాహుల్ ప్రధాని అయిపోరు: జనతాదళ్ నేత

  • ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పై గోపాల్ మండల్ వ్యాఖ్యలు
  • లాలూ మద్దతు ఇస్తే ప్రధాని కాలేరన్న జనతాదళ్ నేత
  • కిడ్నీ మార్పిడి తర్వాత లాలూ పిచ్చోడిగా మారిపోయారని వ్యాఖ్య
JDU leader calls Lalu Yadav crazy for backing Rahul Gandhi as PM

కుమార్తె ఇచ్చిన కిడ్నీ దానంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోలుకున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు పోటీగా జట్టుకట్టిన ఇండియా కూటమి సమావేశాల్లోనూ లాలూ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అయ్యేందుకు వీలుగా లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు ఇస్తుండడాన్ని జేడీయూ నేత గోపాల్ మండల్ వ్యతిరేకిస్తున్నారు. 

‘‘2024 లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకం చేసింది నితీశ్ కుమార్ (బీహార్ సీఎం, జేడీయూ అధినేత). లాలూజీ పేద ప్రజల అభిమాన నేత. మా సీనియర్ నాయకుడు కూడా. కాకపోతే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా లాలూ పరిగణించినంత మాత్రాన ఆయన ప్రధాని అవుతారని లేదు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే లక్షణాలు లేవని అనడం లేదు. రాహుల్ మాజీ ప్రధానుల కుటుంబం నుంచి వచ్చాడు. కేవలం లాలూజీ మద్దతుగా నిలిచినంత మాత్రాన ఆయన ప్రధాని కాలేరు. లాలూజీ కిడ్నీ మార్పిడిన తర్వాత పిచ్చోడిగా మారిపోయారు’’ అని మండల్ వ్యాఖ్యానించారు.

More Telugu News