Etela Rajender: ఈటల రాజేందర్ కు తప్పిన పెను ప్రమాదం

Etela Rajender escaped safely from accident
  • మానకొండూరు మండలం లలితాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
  • డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి గుద్దిన కాన్వాయ్ లోని మారో వాహనం
  • సురక్షితంగా బయటపడ్డ ఈటల
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. మానకొండూరు మండలం లలితాపూర్ వద్ద వెళ్తున్న సమయంలో రోడ్డుపై గొర్రెల మంద అడ్డు రావడంతో ఈటల ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. కారు హఠాత్తుగా ఆగడంతో, కాన్వాయ్ లో వెనుక వస్తున్న వాహనం ఈటల కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్పల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో, ఈటల మరో వాహనంలో హైదరాబాద్ కు వెళ్లారు. ప్రమాదంలో ఈటలకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Etela Rajender
BJP
Accident

More Telugu News