ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటో తోలిన యువకుడు..!

Auto Driver Rides On Foot Over Bridge To Escape Traffic In Delhi Arrested
  • దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
  • ట్రాఫిక్ జాం నుంచి తప్పించుకునేందుకు ఆటోవాలా ప్రమాదకర చర్య
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్, వెల్లువెత్తిన విమర్శలు
  • నిందితుడు, అతడికి సహకరించిన వ్యక్తి అరెస్ట్, ఆటో సీజ్
వీధుల్లో కొందరు ఆటోవాలాలు చేసే సర్కస్ ఫీట్లు కొన్నిసార్లు భయాందోళనలు కలిగిస్తాయి. వేగంగా నడపడం, ప్రమాదకరంగా ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయడం వంటి ఎన్నో ఘటనలు గతంలో చూశాం. అయితే, ఢిల్లీలో ఓ ఆటోవాలా గతంలో ఎవరూ చేయని ప్రమాదకరమైన పనిని చేశాడు. 

ట్రాఫిక్ సమస్య తప్పించుకునేందుకు అతడు ఏకంగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటోను తోలాడు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేరు. మరో వ్యక్తి సాయంతో అతడు ఆటోను మెట్లపై ఎక్కించాడు. ఆ తరవాత ఆటోవాలా స్నేహితుడు కూడా అందులోకి ఎక్కేశాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.  ఈ దారుణానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను మున్నాగా పోలీసులు గుర్తించారు. అతడి ఆటోను సీజ్ చేయడంతో పాటూ నిందితుడిని, అతడికి సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
New Delhi
Crime News
Viral Videos

More Telugu News