అజిత్ ను త్వరలోనే తప్పకుండా కలుస్తా: షారుక్ ఖాన్

Will meet Ajith soon says Rajinikanth
  • సెప్టెంబర్ 7న విడుదలవుతున్న 'జవాన్' మూవీ
  • తమిళనాడులో కూడా ఈ చిత్రానికి భారీ డిమాండ్
  • చెన్నైలో ప్రమోషన్స్ నిర్వహించిన షారుక్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన 'జవాన్' మూవీ 7వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది రిలీజైన షారుక్ 'పఠాన్' మూవీ రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు మరో భారీ సినిమాతో షారుక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

ఇప్పటికే 'జవాన్' ప్రీ టికెట్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. రిలీజ్ కు మూడు రోజుల ముందే రెండున్నర లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి రోజే ఈ సినిమా రూ. 100 కోట్ల కలెక్షన్లను రాబట్టబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే నిజమైతే ఒకే ఏడాది ఓపెనింగ్ డే నాడు రూ. 100 కోట్లు రాబట్టిన తొలి హీరోగా షారుక్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. 

ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార నటిస్తోంది. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు కూడా నటించారు. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఈ సినిమాకు డిమాండ్ పెరిగిపోయింది. మరోవైపు షారుక్ స్వయంగా చెన్నైకి వచ్చి సినిమాను ప్రమోట్ చేశాడు. ఈ క్రమంలో రజనీకాంత్, విజయ్ లను షారుక్ కలిశాడు. ఈ నేపథ్యంలో షారుక్ కు ఓ నెటిజన్ ఒక ప్రశ్న వేశాడు. 'సార్ మరోసారి చైన్నైకి వస్తారా? ఎవరినైనా కలవాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా షారుక్ స్పందిస్తూ... 'రజనీ సార్ ని కలిశా. తలపతి విజయ్ ను కలిశా. అజిత్ ను మిస్ అయ్యాను, త్వరలోనే ఆయనను కలుస్తా' అని చెప్పాడు.
Go Back to Shorts
Shahrukh Khan
Jawan Movie
Ajit
Kollywood
Bollywood

More Telugu News