Scorpion farming: తేలు విషం..లీటరు రూ. 82 కోట్లు! ఇంత డిమాండ్ ఎందుకంటే..!

  • కోళ్ల ఫారాల్లాగా తేళ్ల ఫారాలు.. వేల సంఖ్యలో విషపూరిత తేళ్ల పెంపకం
  • నెట్టింట్లో వీడియో వైరల్, ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
  • తేలు విషానికి భారీ డిమాండ్, లీటర్ ధర సుమారు రూ.82 కోట్లు
  • సౌందర్య ఉత్పత్తులు, ఔషధాల తయారీలో తేలు విషం వినియోగం
Scorpion farming to harvest poison to be used in cometics and medicines

వ్యవసాయం.. పశువుల పెంపకం..కోళ్ల ఫారాలు వంటి వాటి గురించి మనందరికీ తెలుసు కానీ తేళ్ల పెంపకం గురించి ఎప్పుడైనా విన్నారా? కోళ్ల ఫారాలు లాగానే తేళ్ల ఫారాలు కూడా ఉంటాయని, వాటిల్లో వేల సంఖ్యలో విషపూరిత తేళ్లను పెంచుతారని తెలుసా? తేలు పేరు చెబితేనే మనం భయపడిపోతాం కానీ తేలు విషానికి మార్కెట్లో బోలెడంత డిమాండ్ ఉంది. లీటర్ విషం ధర రూ.82 కోట్ల వరకూ ఉంటుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వేల కొద్దీ తేళ్లు ఒకే చోట లుకలుకలాడుతూ తిరుగుతుండటం చూడలేక పలువురు భయపడిపోతున్నారు. 

తేలు విషాన్ని సౌందర్య ఉత్పత్తులు, ఇతర ఔషధాల్లో విరివిగా వాడతారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయక వైద్య విధానాల్లో తేలు విషానికి అమిత ప్రాధాన్యం ఉంది. దీంతో, అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు వెలిశాయి. క్యాన్సర్ మందుల తయారీలోనూ తేలు విషం వాడతారట. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. 

ఒక్కో తేలు నుంచి రోజుకు 2 మిల్లీలీటర్ల విషం వస్తుంది. తేలు కొండెను ట్వీజర్స్‌తో పిండి విషాన్ని బయటకు తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎటువంటి హాని జరగదు. నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న తేళ్ల ఫారం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

More Telugu News