ఇక వినోదమే వినోదం... బిగ్ బాస్ తెలుగు షో సీజన్-7 ప్రారంభం

Bigg Boss Telugu Season 7 has kicked off
  • ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు షో
  • ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున
  • కలర్ ఫుల్ గా, రిచ్ నెస్ ఉట్టిపడేలా ఉన్న బిగ్ బాస్ ఇల్లు
  • మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన ప్రియాంక జైన్
వినోదాలకు అడ్డా, వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. బిగ్ బాస్-7 నేడు ప్రారంభమైంది. గత కొన్ని సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా కొనసాగనున్నారు. 

ఇక, తొలి కంటెస్టెంట్ గా టీవీ నటి ప్రియాంక జైన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించింది. కొత్త సీజన్ కావడంతో ఇంటి సెట్టింగ్ కూడా కొత్తగా ఉంది. గత సీజన్లతో పోల్చితే ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎక్స్ టీరియర్స్, ఇంటీరియర్స్ పూర్తిగా మార్చేశారు. కలర్ ఫుల్ గా, రిచ్ నెస్ ఉట్టిపడేలా బిగ్ బాస్ ఇంటిని తీర్చిదిద్దారు. 

అయితే ఫర్నిచర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎందుకో నాగార్జున వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లు కొన్ని టాస్క్ ల ద్వారా బిగ్ బాస్ ఇంటికి అవసరమైన ఫర్నిచర్ ను సంపాదించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 

ప్రోమోలో చెప్పినట్టుగానే ఉల్టా పుల్టా ఖాయమని బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ చెబుతోంది.
Go Back to Shorts
Bigg Boss-7
Telugu Season
Reality Show
Nagarjuna
Telangana
Andhra Pradesh

More Telugu News