Thummala: కాంగ్రెస్ లో తుమ్మల చేరికకు ముహూర్తం ఫిక్స్

Thummal joining Congress in presence of Rahul Gandhi
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ఖమ్మం జిల్లా రాజకీయాలు
  • తుమ్మలను కలిసిన మల్లు భట్టి విక్రమార్క
  • ఈ నెల 6న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల
తెలంగాణలో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖరారయింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. 

మరోవైపు తుమ్మల నివాసానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా భట్టికి తుమ్మల చెప్పారు. ఇంకోవైపు నిన్న తుమ్మల నివాసానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఇటీవల ఆయనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కలిశారు. కాంగ్రెస్ కీలక నేతలంతా ఆయనను కలిసి పార్టీలోకి స్వాగతిస్తున్నారు.

Thummala
Mallu Bhatti Vikramarka
Rahul Gandhi
Congress

More Telugu News