One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణకు తడిసిమోపెడవుద్ది.. రూ. 9300 కోట్లు అవుతుందని అంచనా

  • జమిలి ఎన్నికలకు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అవసరం
  • ఎన్నికల అనంతరం వాటిని భద్రపరిచేందుకు భారీగా ఖర్చు
  • ఈసారి పాక్షికంగా జమిలికి వెళ్లే ఆలోచనలో కేంద్రం
One Nation One Election not possible now

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగా రూ.9,300 కోట్లు ఖర్చు అవుతాయని ఎన్నికల సంఘం గతంలోనే అంచనా వేసింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల అనంతరం తిరిగి వాటిని భద్రపరిచేందుకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 2015లోనే న్యాయ, ప్రజాఫిర్యాదులు, సిబ్బందిశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన నివేదికలో ఎన్నికల సంఘం ఈ అంశాలను ప్రస్తావించింది. 

తాజాగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఎన్నికల ఖర్చు అంశంపైనా దృష్టిపెట్టనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోనే నివేదిక సమర్పించే అవకాశాలులేవు. ఒకవేళ సమర్పించినా ఐదు రాజ్యాంగ సవరణలు చేయడం, సగం రాష్ట్రాల ఆమోదం పొందడం అంత సులువైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఈసారి పాక్షిక జమిలి ఎన్నికలు నిర్వహించాలని, లోక్‌సభతోపాటు 10-12 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News