Rains: ఆగస్టులో ముఖం చాటేసిన వరుణుడు.. 122 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం

  • జులైలో భారీ వర్షాలతో బెంబేలు
  • ఆగస్టులో చుక్క వాన కరవు
  • 1968 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదు
Lowest rains in August after 122 years

జులైలో భారీ వర్షాలతో బెంబేలెత్తించిన వరుణుడు ఆగస్టులో మాత్రం ముఖం చాటేశాడు. 122 సంవత్సరాల తర్వాత ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 1971-2000ను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో ఆగస్టు నెలలో సగటున 254.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా సాధారణం కంటే 36 శాతం తక్కువగా 162.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2005లో 191.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ఈ ఆగస్టులో దక్షిణ భారతదేశంలో 190.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా సాధారణం కంటే ఏకంగా 60శాతం తక్కువగా 76.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 122 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అంతకుముందు 1968లో ఇదే నెలలో 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ తెలిపింది.

More Telugu News