Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల

ఈరోజు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డంతో, చాలా సీరియస్ లుక్ తో పవన్ ఉన్నారు. ఈ పోస్టర్ ఒక ఫైట్ సీన్ కు సంబంధించినదని తెలుస్తోంది. 
 
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నికల లోపు ఈ సినిమాను పవన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది. 
Hari Hara Veeramallu
Pawan Kalyan
Poster
Birthday
Tollywood

More Telugu News